ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగము
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిదే కీలక పాత్ర. రాష్ట్ర జనాభాలో సగం కంటే ఎక్కువమంది తమ జీవనోపాధి కోసం పూర్తిగా లేదా అధిక భాగం వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. పేదరిక నిర్మూలనకు వ్యవసాయాభివృద్ధి కీలకమవుతోంది. ఈ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకొని పేదరికాన్ని తగ్గించవచ్చు. గత కొన్ని దశాబ్దాల్లో రాష్ట్ర వ్యవసాయ రంగం గణనీయమైన మార్పులకు లోనైంది. ముఖ్యంగా 80వ దశకంలో కీలక మార్పులు ప్రారంభమయ్యాయి.
సంప్రదాయిక ఆహారపంటలతోపాటు వాణిజ్యపంటల సాగులోనూ మార్పు చోటుచేసుకుంది. నూనెగింజలు, పత్తి, చెరకు పంటల సాగు పెరిగింది. 1990వ దశకంలో తరచూ కరవులు సంభవించడం వల్ల దిగుబడులు పడిపోయాయి. ఉత్పత్తిలో భారీ హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. అయినా రాష్ట్ర వ్యవసాయ రంగంలో మార్పులు కొనసాగాయి. ముఖ్యంగా అధిక విలువ ఉన్న పంటల సాగు మొదలైంది. పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, కోళ్లు, చేపల ఉత్పత్తి దిశగా రాష్ట్ర వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో మార్పు వచ్చింది. అందువల్ల ప్రస్తుతం రాష్ట్ర మొత్తం వ్యవసాయ ఆదాయంలో, అనుబంధ రంగాల వాటానే ఎక్కువగా ఉంది. పంటల రంగంలోనూ ఉద్యానవన పంటల వాటా ఎక్కువ. అధిక విలువ ఉన్న ఉద్యాన పంటలు, అనుబంధ రంగాల్లో మంచి వృద్ధిని సాధించాం. ఈ మార్పులే వ్యవసాయ రంగాన్ని కాపాడాయని చెప్పవచ్చు.
రాష్ట్ర అభివృద్ధి వ్యూహంలో భాగంగా
- రైతుల ఆదాయాలను పెంచడం
- వ్యవసాయ రంగంలో సుస్థిరాభివృద్ధిని సాధించడం
- అనుబంధ రంగాల్లోని అధిక అభివృద్ధిని సుస్థిరం చేయడం
- పన్నెండో ప్రణాళికా కాలంలో రాష్ట్ర వ్యవసాయ రంగం మరింత వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం సూక్ష్మ నీటిపారుదల (మైక్రో ఇరిగేషన్), శ్రీ సాగు విధానం, సూక్ష్మ పోషకాలు, మెట్ట ప్రాంత వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణ, నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడం లాంటి అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు.
రాష్ట్ర మొత్తం భూ వైశాల్యంలో 22.7 శాతంలో అడవులున్నాయి. 2010-11 లో రాష్ట్రంలోని మొత్తం భూమిలో 52.8 శాతంలో పంటలు ఉన్నాయి. అంటే పంటల విస్తీర్ణం ఉన్న మొత్తం ప్రాంతం 145.12 లక్షల హెక్టార్లు. మొత్తం భూమి వైశాల్యం 275.04 లక్షల హెక్టార్లు. 2010-11 లో రాష్ట్రంలోని మొత్తం పంటల విస్తీర్ణంలో 67.07 శాతంలో ఆహార పంటలు, మిగిలిన 32.93 శాతం విస్తీర్ణంలో ఆహారేతర పంటలు సాగయ్యాయి.
2009-10తో పోలిస్తే 2010-11లో రాష్ట్రంలో పప్పు దినుసుల సాగు విస్తీర్ణం 10.2 శాతం పెరిగింది. అదేవిధంగా వీటి ఉత్పత్తి 0.6 శాతం పెరిగింది. 2009-10తో పోలిస్తే 2010-11లో రాష్ట్రంలో ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం 20.4 శాతం, ఉత్పత్తి 30.2 శాతం పెరిగాయి. పప్పుదినుసులు, ఆహారధాన్యాల ఉత్పత్తి, సాగు విస్తీర్ణాన్ని జిల్లాల వారీగా చూస్తే అనేక తారతమ్యాలున్యాయి. పప్పు దినుసుల సాగులో కర్నూలు జిల్లా రాష్ట్రంలో ముందుంది. ఆ తర్వాతి స్థానాల్లో ప్రకాశం, మహబూబ్‌నగర్, అనంతపురం జిల్లాలున్నాయి. కర్నూలు జిల్లా ఆహారధాన్యాల సాగులోనూ ముందుంది. తర్వాతి స్థానాల్లో గుంటూరు, కృష్ణా, మహబూబ్‌నగర్ ఉన్నాయి. 2009-10లో రాష్ట్రంలో నూనె గింజల సాగు విస్తీర్ణం 22.24 లక్షల హెక్టార్లు కాగా, 2010-11లో 24.72 లక్షల హెక్టార్లకు పెరిగింది. అత్యధికంగా (34.74%) అనంతపురంలోనే సాగవుతోంది.
అతి తక్కువగా (0.44%) కృష్ణా జిల్లాలో సాగయ్యింది. ప్రధాన నూనెగింజల పంటలు వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు. అనంతపురంలో మాత్రం ప్రధాన నూనెగింజ పంట వేరుశనగ. ఈ ఒక్క జిల్లాలోనే 8.34 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంట సాగయ్యింది.
రాష్ట్రంలో సాగయ్యే ఇతర ప్రధాన పంటలు పత్తి, మామిడి, మిర్చి, ఉల్లి, చెరకు, పొగాకు. 2009-10తో పోలిస్తే 2010-11లో కొన్ని పంటల సగటు దిగుబడి పెరిగింది. ఇదే సమయంలో మరికొన్ని పంటల దిగుబడి తగ్గింది. గోధుమ, జొన్న, మొక్కజొన్న, రాగులు, ఉల్లి, వేరుశనగ, చెరకు పంటల దిగుబడి పెరగ్గా; మిర్చి, చింతపండు, నువ్వులు, పత్తి, పొగాకు లాంటి పంటల దిగుబడి తగ్గింది. దిగుబడి విషయంలోనూ వివిధ జిల్లాల మధ్య గణనీయమైన తేడా ఉంది. 2010-11లో నిజామాబాద్ జిల్లాలో బియ్యం దిగుబడి అధికంగా ఉంది. తర్వాతి స్థానాల్లో నెల్లూరు, మెదక్, కరీంనగర్ ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో బియ్యం సగటు దిగుబడి హెక్టారుకు 3809 కిలోలు. అతి తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో హెక్టారుకు 866 కిలోల దిగుబడి మాత్రమే వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో సగటు బియ్యం దిగుబడి హెక్టారుకు 3035 కిలోలు.
రాష్ట్ర వ్యవసాయ రంగానికి అతి పెద్ద సవాలు తరచూ సంభవించే వర్షాభావ పరిస్థితులు. 2011-12 ఆర్థిక సంవత్సరంలో నైరుతి రుతుపవనాల ద్వారా రాష్ట్రంలో కురిసిన వర్షపాతం 539 మిల్లీ మీటర్లు. నిజానికి వీటివల్ల కురవాల్సిన సాధారణ వర్షపాతం 624 మిల్లీమీటర్లు. అంటే లోటు 13.6 శాతం. ఈశాన్య రుతుపవనాల ద్వారా వచ్చిన వర్షపాతం 113 మిల్లీ మీటర్లు కాగా, రావాల్సిన సాధారణ వర్షపాతం 224 మిల్లీ మీటర్లు. లోటు 49.6 శాతం. 2012-13లో కూడా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండనుందనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
2011-12లో వర్షాభావ పరిస్థితుల వల్ల ఆహారధాన్యాల పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే తగ్గాయి. 2010-11లో రాష్ట్రంలో మొత్తం 80.29 లక్షల హెక్టార్లలో ఆహారధాన్యాల పంటలు సాగైతే, 2011-12లో 70.60 లక్షల హెక్టార్లకు పడిపోయింది. అంటే తరుగుదల 12.07 శాతం. 2011-12లో ఆహారధాన్యాల మొత్తం ఉత్పత్తి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 30 లక్షల టన్నుల మేరకు తగ్గుతుందని అంచనా. 2010-11లో రాష్ట్రంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 203.14 లక్షల టన్నులు కాగా ఇది 2011-12లో 173.05 లక్షల టన్నులకు తగ్గింది. ఇది 14.81 శాతం తరుగుదల.
2011-12 ఖరీఫ్‌లో ఆహారధాన్యాల విస్తీర్ణం 43.06 లక్షల హెక్టార్లు ఉండగలదని అంచనా. 2010-11లో సాగైన 45.81 లక్షల హెక్టార్ల పంట విస్తీర్ణం కంటే ఇది 6 శాతం తక్కువ. అదేవిధంగా 2010-11లో ఖరీఫ్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తి 98.52 లక్షల టన్నులుండగా, 2011-12లో స్వల్పంగా 98.03 లక్షల టన్నులకు తగ్గింది. అంటే తరుగుదల 0.5 శాతం. 2011-12 రబీలో ఆహారధాన్యాల పంట విస్తీర్ణం 27.54 లక్షల హెక్టార్లు. ఇది అంతకుముందు ఏడాదిలోని 34.48 లక్షల హెక్టార్ల కంటే తక్కువ. అదేసమయంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 75.02 లక్షల టన్నులని అంచనా. అంతకుముందు ఏడాదిలోని 104.62 లక్షల టన్నుల కంటే చాలా తక్కువ. గత దశాబ్దకాలంలో కరవులు, వరదలు, అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతివైపరీత్యాల వల్ల ఆహారధాన్యాల విస్తీర్ణంలో, ఉత్పత్తిలో భారీగా హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. అయితే, అధిక దిగుబడినిచ్చే వంగడాల వాడకం, కొత్త సాగు పద్ధతులను అనుసరించడం వల్ల ఆహారధాన్యాల ఉత్పత్తి మొత్తం మీద పెరిగింది.
రాష్ట్రంలో భూకమతాలకు సంబంధించిన సమాచారాన్ని 1970-71 నుంచి సేకరిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం 2005-06 సంవత్సరానికి సంబంధించింది. రాష్ట్రంలో సగటు భూకమతాల సైజు స్వల్పంగా తగ్గింది. 2000-01లో సగటు భూకమతాల సైజు 1.25 హెక్టార్లుండగా 2005-06లో ఇది 1.20కి తగ్గింది. ఇదేకాలంలో రాష్ట్రంలో భూకమతాల సంఖ్య మాత్రం 1.153 కోట్ల నుంచి 1.204 కోట్లకు పెరిగింది. తొమ్మిదో భూకమతాల గణన 2011 అక్టోబరు 1న ప్రారంభమైంది.
వ్యవసాయరంగంలో ఇప్పటివరకు ఉన్న ఈ ధోరణుల నేపథ్యంలో రాష్ట్రం ముఖ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది. అవి:
- వ్యవసాయరంగంలో సుస్థిరాభివృధ్ధి సాధించాలి
- రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయం వాటాను మరింతగా పెంచాలి
- వ్యవసాయాదాయాన్ని ముఖ్యంగా రైతులకు వచ్చే సగటు ఆదాయాలను పెంచాలి
- ఈ రంగంలో స్థిరమైన వృద్ధిరేటును తీసుకురావాలి
- ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలి.
- ఫలితంగా రైతులకు పెట్టిన పెట్టుబడిపై అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.
1951-52 ఆర్థిక సం. నాటికి జాతీయ స్థూల ఉత్ఫత్తిలో వ్యవసాయ మరియు అనుబంధ రంగాల వాటా 51.45% ఉంటే ఆర్థిక సంస్కరణల అమలు మొదలు పెట్టిన 1991-92 నాటికి 28.54%కి పడిపోతే, 2015-16 నాటికి 15.4%కు దిగజారి పోయింది.1951-52లో 9% ఉన్న పారిశ్రామిక రంగం 2015-16 నాటికి 17.5%కు మాత్రమే పెరిగింది. సేవా రంగం మాత్రం 29.63% నుండి 64%కు శరవేగంగా ఎగబాకింది. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలు మరియు తయారీ రంగం కంటే సేవా రంగంపై మన ఆర్థిక వ్యవస్థ ఎంతగా ఆధారపడి ఉన్నదో ఈ గణాంకాలే చెబుతున్నాయి.
భారత్.. వ్యవసాయ విధానం
అల్పాభివృద్ధి దేశాల్లో ఆర్థికాభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడంలో వ్యవసాయ రంగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. దేశంలో ప్రజలందరికీ ఆహారాన్ని అందించడమే కాకుండా ఎక్కువ శ్రామిక శక్తికి ఉపాధి, పొదుపు పెంపొందించడం, పారిశ్రామిక ఉత్పత్తులకు మార్కెట్, విదేశీ మారకద్రవ్యం ఆర్జనలాంటి విషయాలలో వ్యవసాయ రంగం పాత్ర ప్రధానమైంది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు జాతీయాదాయానికి ఎక్కువ వాటాను సమకూర్చటమే కాకుండా, ఎక్కువమంది శ్రామిక శక్తికి.. ఉపాధి కల్పనలో ఈ రంగం ముందంజలో ఉంది.
సుమారు 72 శాతం శ్రామిక శక్తి వ్యవసాయరంగంపై ఆధారపడటాన్ని బట్టి స్వాతంత్య్రం వచ్చినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ ఆధారిత వ్యవస్థగా భావించవచ్చు. వ్యవసాయేతర రంగాల అభివృద్ధి, మొత్తం ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వ్యవసాయరంగ అభివృద్ధిపైనే ఆధారపడటాన్ని స్వాతంత్య్రానంతరం మనం గమనించొచ్చు.
స్వాతంత్య్రానికి ముందు 50 ఏళ్లలో వ్యవసాయరంగంలో వృద్ధి సగటున ఒక శాతం, కాగా.. స్వాతంత్య్రానంతర కాలంలో సగటు వార్షిక వృద్ధి 2.6 శాతం. 1950, 1960 దశకాలలో సాగు విస్తీర్ణంలో పెరుగుదల నమోదు కాగా.. తర్వాత కాలంలో వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించి పెరిగిన భూవిస్తీర్ణంలో తగ్గుదల సంభవించింది. వ్యవసాయ ఉత్పత్తిలో వృద్ధికి ముఖ్య ఆధారంగా ఉత్పాదకతలో పెరుగుదల వెలుగులోకి వచ్చింది.
స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఆహార ధాన్యాల దిగుమతిపై భారత్ ఆధారపడగా తర్వాత కాలంలో ఈ ఉత్పత్తుల దిగుమతులను నిరోధించడంలో వ్యవసాయ రంగం విజయవంతమైంది. ఉత్పత్తి, దిగుబడిలో వచ్చిన మార్పులే కాకుండా ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు సంభవించడానికి వ్యవసాయ రంగం దోహదపడింది.
ప్రభుత్వం అమలు పరిచిన భూసంస్కరణలు, వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పాటు, నూతన వ్యవసాయ అభివృద్ధి వ్యూహం అమలు, పరిశోధన, విస్తరణ సేవలపై పెట్టుబడి, పరపతి సౌకర్యాల పెంపు వంటి చర్యలు వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రధాన కారకాలుగా నిలిచాయి. ప్రపంచ వాణిజ్య సంస్థను (డబ్ల్యూటీఓ) ఏర్పాటు చేసిన తర్వాత వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల స్థితిలో కొంత ప్రతికూల వాతావరణం కన్పిస్తుంది.
ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత భారత్‌లో అన్ని పంటల ఉత్పత్తి వృద్ధి 2.93 శాతం నుంచి 1.57 శాతానికి తగ్గింది. లైవ్‌స్టాక్ వృద్ధి 4.21 శాతం నుంచి 3.40 శాతానికి, ఫిషరీస్ రంగ వృద్ధి 7.48 నుంచి 3.25 శాతానికి తగ్గింది అయితే.. అడవుల విషయంలో మాత్రం వృద్ధి 0.09 నుంచి 1.82 శాతానికి పెరిగింది.
వ్యవసాయ విధానం:
స్వాతంత్య్రానంతరం వ్యవసాయరంగ అభివృద్ధిలో భాగంగా అనేక సంస్థాపరమైన అవస్థాపన సౌకర్యాల్లో మార్పులు ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రానంతరం వ్యవసాయరంగ అభివృద్ధిని నాలుగు దశలుగా విభజించవచ్చు. మొదటి దశ (1947-1960 దశకం మధ్య కాలం), రెండోదశ (1960వ దశకం మధ్యకాలం నుంచి 1980 వరకు), మూడో దశ (1980 నుంచి 1991 వరకు), నాలుగో దశ (1991-92 తర్వాత కాలం)గా పేర్కొనవచ్చు.
మొదటి దశ:
వ్యవసాయ విధానం మొదటి దశలో వ్యవసాయ సంస్కరణలు, సంస్థాపర మార్పులు, భారీ నీటిపారుదల ప్రాజెక్టుల అభివృద్ధి, సహకార పరపతి సంఘాల పటిష్టత కోసం చర్యలు తీసుకున్నారు. భూసంస్కరణల్లో భాగంగా మధ్యవర్తుల తొలగింపు, భూమిని వాస్తవంగా సేద్యం చేసిన వారికి భూపట్టాల పంపిణీ జరిగింది.
తద్వారా వ్యవసాయరంగంలో కమతాలపై యాజమాన్య హక్కులు పొందిన సాగుదార్లు చూపించిన శ్రద్ధ వల్ల వ్యవసాయ ఉత్పాదకత పెరిగింది. మొదటి దశలో వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు భూసంస్కరణలు కారణమయ్యాయి. బ్రిటిష్ పాలనలో స్తంభించిన వ్యవసాయ రంగాన్ని తిరిగి పురోగమింప చేసే కృషిలో భాగంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ప్రణాళికా వికేంద్రీకరణ, సాంద్ర ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టారు.
రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే దిశగా నడిపించేందుకు ప్రోత్సాహక ధరల విధానాన్ని ప్రవేశపెట్టడానికి వ్యవసాయ ధరల కమిషన్‌ను 1965లో ఏర్పాటు చేశారు. దేశంలో పెరుగుతున్న జనాభాకు తగినంత ఆహారాన్ని అందించే చర్యలో భాగంగా ప్రభుత్వం ఈ దశలో ఆహారధాన్యాల దిగుమతిపై ఆధారపడింది.
రెండో దశ:
వ్యవసాయ రంగంలో నూతన వ్యవసాయ వ్యూహాన్ని 1960 వ దశకం మధ్యకాలం నుంచి అవలంభించడం ద్వారా వ్యవసాయరంగంలో రెండో దశ ప్రారంభమైంది. నూతన వ్యవసాయ వ్యూహంలో భాగంగా మేలురకమైన విత్తనాల వినియోగం, బహుళ పంటలు, ఆధునిక వ్యవసాయ పనిముట్లు, నీటిపారుదల సౌకర్యాల విస్తర ణ జరిగింది. ఈ వ్యూహంలో భాగంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధ్యమైంది. ఈ దశలో వ్యవసాయరంగంలో సంస్కరణలు చోటు చేసుకోలేదు. అయితే విధాన నిర్ణేతలు పరిశోధన, విస్తరణ, ఉత్పాదితాల సరఫరా, పరపతి, మార్కెటింగ్, మద్దతు ధర, సాంకేతిక పరిజ్ఞానం వ్యాప్తిలాంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చారు.
మూడో దశ:1980వ దశకం ప్రారంభంలో వ్యవసాయ రంగంలో మూడో దశ ప్రారంభమైంది. ఈ కాలంలో పంటల మార్పిడి సాధ్యమయింది. ఆహారేతర ఉత్పత్తుల్లో అధిక వృద్ధి నమోదైంది. మరోవైపు పాలు, ఫిషరీస్, పౌల్ట్రీ, కూరగాయలు, పండ్ల ఉత్పత్తుల్లో గణనీయ ప్రగతి నమోదైంది. ఈ కాలంలోనే వ్యవసాయ రంగానికి సబ్సిడీలు పెరిగాయి. వ్యవసాయ రంగంలో మౌలిక సౌకర్యాల అభివృద్ధిపై ప్రభుత్వరంగ పెట్టుబడులు తగ్గాయి. అయితే రైతుల పెట్టుబడిలో మాత్రం పెరుగుదల కన్పించింది.
నాలుగో దశ:
1991లో ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో వ్యవసాయరంగంలో వ్యవసాయ విధానం నాలుగో దశ ప్రారంభమైంది. అనేక నియంత్రణల సడలింపు, అనేక కార్యకలాపాల్లో ప్రభుత్వ పరిధిని తగ్గించడం, సరళీకరణ వంటి విధానాలు ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగంలో ప్రత్యక్షంగా ఏవిధమైన సంస్కరణలు ప్రవేశపెట్టనప్పటికీ వినిమయరేటులో సంభవించిన ఒడిదుడుకులు ఈ రంగంపై పరోక్ష ప్రభావాన్ని చూపించాయి. పారిశ్రామిక రంగానికి సంబంధించి రక్షణ విధానాన్ని ఉపసంహరించుకోవడం, విదేశీ వాణిజ్య సరళీకరణలాంటి విధానాలు కూడా వ్యవసాయరంగ అభివృద్ధిపై కొంత మేర ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి.
ప్రపంచవాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనల మేరకు స్వదేశీ మార్కెట్లో ప్రవేశపెట్టిన సరళీకరణ విధానాలు వ్యవసాయ రంగంలో సంక్షోభానికి కారణమయ్యాయి. విధాన నిర్ణేతలకు ఈ దశలో వ్యవసాయ రంగం ఒక సవాలుగా నిలిచింది. దీనివల్లే భారత ప్రభుత్వం జూలై 2000లో నూతన వ్యవసాయ విధానం ప్రవేశపెట్టింది. వనరుల సమర్థ వినియోగం ద్వారా వ్యవసాయ రంగంలో నాలుగు శాతం వృద్ధి సాధించడం వ్యవసాయ విధానం లక్ష్యం. కేంద్ర, రాష్ర్ట్ర స్థాయిలో నూతన వ్యవసాయ విధానం లక్ష్యాలు సాధించడానికి కాలప్రాతిపదికన యాక్షన్ ప్లాన్స్ రూపొందించవలసిన అవసరం ఉంది.
పంటల తీరులో మార్పు:
ఒక నిర్ణీతకాలంలో వివిధ పంటల కింద ఉన్న భూవిస్తీర్ణాన్ని పంటల తీరు అంటారు. స్వాతంత్య్రానంతరం మొత్తం పంటల విస్తీర్ణంలో ఆహారేతర పంటల విస్తీర్ణం పెరుగుతున్నప్పటికీ.. ఆహారపంటల కింద ఉన్న భూవిస్తీర్ణమే ఎక్కువ. ప్రణాళిక రచన ప్రారంభమయ్యే సమయంలో మొత్తం పంటల విస్తీర్ణంలో 76.7 శాతం భూమి ఆహారపంటల కింద 23.3 శాతం భూమి ఆహారేతర పంటల కింద ఉంది.
2001 లెక్కల ప్రకారం మొత్తం విస్తీర్ణంలో ఆహార పంటల విస్తీర్ణం 65.83 శాతానికి తగ్గగా ఆహారేతర పంటల కింద ఉన్న విస్తీర్ణం 34.17 శాతానికి పెరిగింది. వివిధ పంటలకు సంబంధించి భూపంపిణీలో వచ్చిన మార్పు వ్యవసాయ రంగాన్ని జీవనాధార వ్యవసాయం నుంచి కమర్షియల్ క్రాపింగ్ (వాణిజ్యపరమైన వ్యవసాయం)గా మార్చింది. మార్కెట్లో ధరలతోపాటు ప్రతి హెక్టారుకు లభించే లాభదాయకత ఆహారేతర పంటల విషయంలో ఎక్కువగా ఉండటం.. వీటి భూ విస్తీర్ణం పెరగడానికి కారణం.
మొత్తం పంటల విస్తీర్ణంలో 54.43 శాతం భూమి ఆహార ధాన్యాల కింద, 11.4 శాతం భూమి పప్పు ధాన్యాల కింద ఉంది. ధాన్యపు పంటలు, పప్పు ధాన్యాలు కింద ఉన్న విస్తీర్ణంలో పెరుగదల సంభవించగా, పప్పు ధాన్యాల విస్తీర్ణంలో పెరుగుదల కంటే ధాన్యపు పంటల (cereals) విస్తీర్ణంలో పెరుగుదల రేటు ఎక్కువ. నీటిపారుదల సౌకర్యాలు, రసాయన ఎరువులు, మేలురకమైన విత్తనాల వల్ల పంటల విస్తీర్ణంలో ఏ విధమైన పెరుగదల సంభవించనప్పటికీ ఆహారధాన్యాలకు సంబంధించిన విస్తీర్ణంలో మార్పు ఎక్కువ ఉంటుంది. 1950-51 తర్వాత ధాన్యపు గింజలు (Coarse Cereals) కింద ఉన్న భూవిస్తీర్ణంలో తగ్గుదల సంభవించింది.
ఆహార వినియోగ ప్రక్రియలో మార్పు:
వినియోగదారుల అభిరుచులు, సరఫరా అనుకూలంగా ఉండటం, సాపేక్ష ధరలలోని మార్పు వల్ల ఆహార వినియోగ ప్రక్రియలో మార్పులు సంభవించాయి. పట్టణీకరణ, ఆర్థికవృద్ధిలో పెరుగుదల ధాన్యపు పంటల తలసరి డిమాండ్‌లో తగ్గుదలకు దారితీసి noncereal food items డిమాండ్‌లో పెరుగుదలకు కారణమైంది. వ్యవసాయ రంగంలో చోటు చేసుకున్న ఆధునికీకరణ ధాన్యపు పంటల తలసరి వినియోగంపై రుణాత్మక ప్రభావాన్ని చూపించింది. 1972-73 నుంచి 2004-05 మధ్యకాలంలో ఆహార వినియోగ ప్రక్రియలో కొన్ని కీలక మార్పులు సంభవించాయి.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కుటుంబ బడ్జెట్లో ఆహార ఉత్పత్తుల వాటా తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో టజ్చిట్ఛ ౌజ జౌౌఛీ మొత్తం కుటుంబ బడ్జెట్ వ్యయంలో 72.9 శాతం నుంచి (1972-73) 2004-05 నాటికి 55 శాతానికి తగ్గింది. ఇదే కాలానికి సంబంధించి పట్టణ ప్రాంతాల్లో share of food మొత్తం కుటుంబ బడ్జెట్ వ్యయంలో 64.5 శాతం నుంచి 42.5 శాతానికి తగ్గింది.
పప్పు ధాన్యాల వాటాలోనూ తగ్గుదల కన్పించింది.
కూరగాయలు, పండ్లు, పాలు, మాంసం, గుడ్లు, వంట నూనెల వాటా మొత్తం కుటుంబ బడ్జెట్ వ్యయంలో పెరుగుతుంది.
...........................................
ముఖ్యాంశాలు
స్వాతంత్య్రానికి ముందు 50 ఏళ్లలో వ్యవసాయ రంగంలో సగటు వార్షిక వృద్ధి ఒక శాతం కాగా స్వాతంత్య్రానంతరం ఈ రంగం సగటున 2.6 శాతం వృద్ధి నమోదు చేసింది.
వ్యవసాయ విధానం మొదటి దశ (1947- 1965) లో భూసంస్కరణలు, సంస్థాపరమైన మార్పులు, భారీనీటిపారుదల ప్రాజెక్టుల అభివృద్ధి, సహకార పరపతి సంఘాల పటిష్టతకు చర్యలు తీసుకున్నారు.
వ్యవసాయరంగంలో నూతన వ్యవసాయ వ్యూహాన్ని 1960వ దశకం మధ్యకాలం నుంచి అవలంభించారు.
ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత అడవులు మినహా మిగులు వ్యవసాయం, అనుబంధాల వృద్ధి రేటు తగ్గింది.
భారత ప్రభుత్వం జూలై 2000లో నూతన వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టింది.
వ్యవసాయం లాభసాటి కావాలి
June 30, 2015
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయం అధికోత్పత్తి ఇచ్చేదిగా ఉండాలని ఆయన భావిస్తున్నారు. స్థిర మైన రాబడి రావాలి, అన్ని రకాల వాతావరణాలను తట్టుకోగలగాలని తద్వారా వ్యవసాయం ఒక బతుకుదెరువు కాదు, ఒక లాభదాయక వనరుగా మార్చాలనే దిశగా ఏపి ప్రభుత్వం పని చేస్తున్నది. పంటల ఉత్పాదకత పెంచుతూ, సాగు ఖర్చులు తగ్గించదలిచారు. లక్ష్యాలను నిర్ధేశించుకోవడం కన్నా వాటి అమలుకు ఎక్కువ ప్రాధాన్యమిస్తేనే ప్రాథమిక రంగాల్లో రెండంకెల ప్రగతి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అంచనా కట్టారు. ప్రాథమిక రంగాల్లో 18.2 శాతం సగటు అభివృద్ధికి అన్ని స్థాయిల్లో కృషి జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. 2015-16లో జీఎస్డీపీలో ప్రాథమిక రంగ వాటా లక్ష్యం రూ.1.69 లక్షల కోట్లుగా నిర్ణయిం చారు. జిల్లాల మధ్య వ్యవసాయ దిగుబడుల్లో అంతరాలను తొలగిస్తే సేద్యంలో 18శాతం వృద్ధిరేటు సాధించవచ్చని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
రైతులను అభివృద్ధి చేయడం, వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించి వాటిని అమలు చేయడం, రైతులకు ఆర్ధిక చేయూత, సాంకేతిక సహకారం అందించడం వంటి బాధ్యతలను ఈ కమిటీ నిర్వర్తించనుంది. 2014 అక్టోబరు పదిహేడున రూ. కోటి మూలధన వాటాతో రైతు సాధికార సంస్థను ఏపీ ప్రభుత్వం నమోదు చేసింది. రుణమాఫీలో సన్న, చిన్నకారు రైతులకు తొలిప్రాధాన్యం కల్పించారు. అగ్రికల్చర్ మిషనుకు అనుసంధానకర్తగా వ్యవహరించనున్న సాధికార సంస్థ సాగును లాభసాతి చేయడమే సాధికార సంస్థ ధ్యేయం అన్నదాత కళ్ళల్లో సంతోషంనింపడంతోపాటు సాగును లాభసాటిగా చేయడమే ధ్యేయంగా రైతు సాధికార సంస్థకు ప్రభుత్వం అంకురార్పణ చేయడం జరిగింది. అందుకోసమే రుణమాఫీ కోసమేగాక వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటారు. అత్యాధునిక పద్ధతులను అవలంభించి సాగు దిగుబడిని పెంచడంతోపాటు ఆదాయం పెరిగేందుకు దోహదపడు తుంది. వనరుల సమీకరణ, నిర్వహణ, ఆధినీకత, అగ్రోప్రాసెసింగ్, భూసార పరీక్షలు అన్నింటినీ పర్యవేక్షించి సాగు ద్వారా ఆదాయం సమకూరే;ఆ చూస్తుంది.
దేశ స్థూల ఆదాయానికి పదిహేడు శాతం వరకూ తోడ్పడటమేకాక జీవనానికి అతిముఖ్యమైన ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమౄఎద్ధికి వ్యవసాయం తోడ్పడుతుంది. భూమి మీద నమ్మకం, అభిమానంతో రైతు వ్యవసాయం వదలకుండా ఉండటంతోనే భారతదేశం తిండిగింజల కోసం అలమటించే దుస్థితి తప్పింది. అటువంటి కీలక వ్యవసాయ రంగం కొన్నే ళ్ళుగా కుదేలవుతున్న స్థితి నుంచి బయటపడేయడానికి ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. మన రైతులు కష్టజీవులు, ఎక్కడికైనా వెళ్ళి వ్యవసాయం చేస్తారు. బళ్ళారి, రాయచూరు, ఉత్తర భారతం, ఆఖరికి చంద్ర మండలానికైనా వెళ్తారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల కృషికి కితాబిచ్చారు. రెండు పాడి పశువులు ఉమ్టే చాలు జీవితం గడిచిపోతుంది. పేదరికం అంతమవుతుంది. ఏపీ ప్రభుత్వం రూ.250 కోట్లతో పశుగ్రాసం అందించడంతో గత ఏడాది పాల ఉత్పత్తి తగ్గలేదు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల దృష్యా ఇప్పుడు అన్నదాతలు ఎక్కడికీ వెళ్లనవరం లేకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రాథమిక రంగ మిషన్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో రైతులకు భరోసా కల్పించినట్లయింది.